దీపావళికి బాంబు రెడీ చేస్తోన్న విజయ్.. మోత మోగాల్సిందేనట!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘బీస్ట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

 Vijay Planning Diwali Treat From Beast Movie, Vijay, Beast, Pooja Hegde, Kollywo-TeluguStop.com

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించగా.ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా అభిమాలకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట హీరో విజయ్.

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న బీస్ట్ చిత్రంలో విజయ్ పాత్రా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా నుండి టీజర్‌ను దీపావళి కానుకగా ఇవ్వాలని విజయ్ చిత్ర యూనిట్‌కు సూచించాడట.

ఈ మేరక చిత్ర యూనిట్ కూడా టీజర్‌ను కట్ చేసేందుకు రెడీ అవుతున్నారట.దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు దీపావళికి రీసౌండ్ మామూలుగా ఉండబోదని తెలుస్తోంది.

ఇక ఈ టీజర్‌లో సినిమాకు సంబంధించిన కాన్సెప్టును కూడా పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ టీజర్‌ను ఎలా కట్ చేస్తారో తెలియాలంటే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రముఖ తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తుండగా సన్‌ పిక్సర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube