దీపావళికి బాంబు రెడీ చేస్తోన్న విజయ్.. మోత మోగాల్సిందేనట!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘బీస్ట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించగా.ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా అభిమాలకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట హీరో విజయ్.

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న బీస్ట్ చిత్రంలో విజయ్ పాత్రా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నుండి టీజర్‌ను దీపావళి కానుకగా ఇవ్వాలని విజయ్ చిత్ర యూనిట్‌కు సూచించాడట.

ఈ మేరక చిత్ర యూనిట్ కూడా టీజర్‌ను కట్ చేసేందుకు రెడీ అవుతున్నారట.

దీంతో విజయ్ ఫ్యాన్స్‌కు దీపావళికి రీసౌండ్ మామూలుగా ఉండబోదని తెలుస్తోంది.ఇక ఈ టీజర్‌లో సినిమాకు సంబంధించిన కాన్సెప్టును కూడా పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ టీజర్‌ను ఎలా కట్ చేస్తారో తెలియాలంటే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రముఖ తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తుండగా సన్‌ పిక్సర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఖమ్మం ఎంపీ స్థానం గెలిచి సోనియాకు కానుక ఇవ్వాలి..: మంత్రి తుమ్మల