సందీప్ కిషన్ నిర్మాణంలో కమెడియన్ సత్య లీడ్ రోల్ లో వస్తున్న సినిమా వివాహ భోజనంబు.ట్రైలర్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ ప్లాన్ చేశారు.థియేటర్లు తెరచుకోకముందు ఈ డీల్ జరుగగా ఈమధ్య చిన్న సినిమాలు డేర్ చేసి థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి.
అయితే సందీప్ కిషన్ కూడా మనసు మార్చుకుని వివాహ భోజనంబు సినిమా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తారని అనుకున్నారు.కాని సందీప్ కిషన్ వివాహ భోజనంబు సినిమాను సోనీ లివ్ లోనే రిలీజ్ చేస్తున్నారు.
తెలంగాణాలో థియేటర్లు అన్ని తెరచుకున్నా ఆంధ్రాలో ఇంకా అన్ని థియేటర్లు తెరచుకోలేదు.అక్కడ నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది.
అందుకే ఈ టైం లో రిస్క్ ఎందుకని సందీప్ కిషన్ ముందు అనుకున్న డీల్ ప్రకారంగానే వివాహ భోజనంబు సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది.
సినిమాలో నిర్మాత సందీప్ కిషన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు. వివాహ భోజనంబు సినిమాను రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశారు.