కరోనా వైరస్ మన జీవితం లోకి వచ్చిన తర్వాత మనకు చాలా కొత్త విషయాలు అలవాటు అయ్యాయి.అవి ఏంటంటే.
మాస్క్ లు, శానిటైజేర్స్, సోషల్ డిస్టెన్స్ అతి ముఖ్యమైనవి.మాస్క్ లేకుండా బయటకు వెళ్తే కరోనా మనతో ఆదుకోవడం పక్కా.
అందుకే మన జీవితంలో మాస్క్ తప్పనిసరి అయ్యింది.అందుకే జనాలు మాస్క్ లేకుండా ఎక్కడికి వెళ్లడం లేదు.
అయితే కొంత మంది మాత్రం మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు.అందుకే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది.కరోనా వచ్చినా కూడా ఎవరికీ చెప్పకుండా బయట తిరిగిన వారు కూడా ఉన్నారు.అలాంటి వారిలో చైతన్యం కలిగించడానికి బెంగాల్ లో అధికారులు వినూత్న ప్రయోగం చేసారు.
ఏంటంటే.త్వరలో దసరా పండగ రాబోతుంది.
బెంగాల్ లో దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి.
ఈ నేపథ్యంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు.
అయితే ఈ సంవత్సరం కొత్తగా తయారు చేయబోతున్నారు.ఈసారి థీమ్ ఇలానే ఉండబోతుందని తెలిపారు.
అమ్మవారికి బంగారంతో చేసిన మాస్క్ ను తొడిగి ఆ ఫోటో ను విడుదల చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అయ్యింది.ఆ మాస్క్ బరువు 20 గ్రాములు.
బగుయాటి ఏరియాలోని పూజ మండపంలో ఉన్న అమ్మవారికి బంగారంతో తయారు చేసిన మాస్క్ తొడిగారు.
కేవలం మాస్క్ మాత్రమే కాదు అమ్మవారి చేతుల్లో ఆయుధాలు పెట్టకుండా వెరైటీగా శానిటైజేర్, ఆక్సిమీటర్లు వంటి వైద్య పరికరాలు పెట్టి వినూత్న పద్దతిలో అవగాహన కల్పించ బోతున్నారు.స్వయంగా అమ్మవారే మాస్క్ పెట్టుకోవడంతో ప్రజలు కూడా చూసి అవగాహన పొందుతారని నిర్వాహకులు చెబుతున్నారు.బెంగాల్ లో అత్యంత వైభవం గా కాళీమాత ఉత్సవాలు జరుపుతారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అవగాహన పొందుతారని వారు చెబుతున్నారు.