బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే.ఈ షోలో ఎన్నో కామెడీ స్కిట్ లను చేసి మంచి కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు సుధీర్.
ప్రస్తుతం బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రేంజ్ మాత్రం అందనంత ఎత్తులో ఉందని చెప్పవచ్చు.ఇక ఈయనకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉంటే జబర్దస్త్ లో సుధీర్ కి ఘోర అవమానం ఎదురైంది.
కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పోవే పోరా అనే షోలో యాంకరింగ్ చేసి యువతను బాగా ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా చేస్త మరో యాంకర్ రష్మీతో బాగా సందడి చేస్తుంటాడు.గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కూడా బాగానే పుకార్లు వచ్చాయి.
కానీ ఇదంతా షో కోసమే చేస్తున్నారని పలుసార్లు తెలిపారు.ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకరింగ్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది.అందులో ఎంట్రీ తోనే సుడిగాలి సుధీర్ కు అవమానం ఎదురయింది.ఎంట్రీలో కొందరు పిల్లలు వేదికపైకి వచ్చి బాగా సందడి చేయగా అందులో సుధీర్ ఒక చిన్న పాప తో ఏం కావాలమ్మా అని ప్రశ్నించాడు.వెంటనే నీ మైకు నాకు ఇవ్వచ్చుగా నీకెందుకు అని పంచ్ వేసింది ఆ పాప.ఆ మాటతో సుధీర్ తెల్ల ముఖం వేసాడు.
అంతటితో ఆగకుండా మరో పాప దగ్గరికి వెళ్లి ఈ పాపని చూస్తుంటే మంచి యాక్టర్ గా ఉంది.కానీ యాక్టర్ అంటే నవరసాలు పలకాలి లేదంటే కష్టం అని అన్నాడు.వెంటనే ఆ పాప కూడా నువ్వెలా యాక్టర్ అయ్యావు అని ప్రశ్నించింది.
సుధీర్ ఆ ప్రశ్నకు బాగా అవమానంగా ఫీల్ అయ్యాడు.ఇక అక్కడున్న వాళ్ళంతా తెగ నవ్వుకున్నారు.
ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.