ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు మీద వ్యామోహంతో మానవ సంబంధాలు మంట కలుపుతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ తన భర్త చనిపోవడంతో తన మామ తనకు చెందాల్సిన ఆస్తులను ఇవ్వకుండా అడ్డు పడుతున్నాడని ఏకంగా తన ప్రియుడితో కలిసి తన మామను దారుణంగా హత్య చేయించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మీరట్ నగర పరిసర ప్రాంతంలో శాలిని అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే ఇటీవలే శాలిని భర్త అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు.
దీంతో అప్పటి నుంచి శాలిని ఒంటరిగా ఉంటోంది.అయితే ఈ మధ్య కాలంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.
దీంతో ఒంటరిగా ఉంటున్న శాలిని యువకుడితో వివాహం అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది.దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు.
కాగా ఇటీవలే ఈ విషయం శాలిని భర్త తండ్రి మరియు శాలిని మామకి తెలియడంతో వీరిద్దరిని ఈ విషయంపై మందలించారు.
దీంతో అప్పటి నుంచి శాలిని తన కుటుంబ సభ్యులతో వేరుగా ఉండాలని ప్రయత్నాలు చేస్తోంది.కానీ శాలిని మామ మాత్రం తన మనవడు, మనవరాళ్లు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఆస్తులు పంచడానికి నిరాకరించాడు.దీంతో శాలిని కి మరియు తన మామ కి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
అయితే ఈ గొడవల కారణంగా విసిగి పోయిన శాలిని తన ఆస్తులను దక్కించుకునేందుకు తన ప్రియుడితో కలిసి తన మామ ని దారుణంగా హత్య చేయించాలని పన్నాగం పన్నింది.ప్లాన్ లో భాగంగా తన ప్రియుడిని ఉసుగొలిపి తన మామని దారుణంగా హత్య చేయించింది.
అనంతరం ఏమి ఎరగనట్లు పోలీసులకు సమాచారం అందించింది.కానీ శాలిని ప్రవర్తనలో మార్పులు గమనించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తనకు చెందాల్సిన ఆస్తులను చెందకుండా చేస్తున్నందుకు తన మామని తన ప్రియుడితో కలిసి తానే హత్య చేయించినట్లు నేరం అంగీకరించింది.