క్రికెట్ ప్రపంచంలో అద్భుతాలకు, సంచలనాలకు కొదువే ఉండదని అందరికీ తెలిసిందే.ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు.
అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాలు నమోదు కావడం సర్వసాధారణమే.ఓడిపోయే జట్టు అనూహ్యంగా పరుగులు సాధించి సంచలన విజయం నమోదు చేయొచ్చు.
ఇక ఓటమి అంచుల్లో ఉన్న టీమ్ కూడా అద్భుతాలు సృష్టించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోవచ్చనేది ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం.ఇక ఇలాంటివి టీ20 క్రికెట్ లో అనేకం ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే.
ఇక చివరి ఓవర్‌లో జరిగే అద్భుతాలు ఎంత చెప్పినా తక్కువే.నిజంగా కండ్లతో చూస్తేగానీ నమ్మలేం.నరాలు తెగే ఉత్కంఠను ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు పంచాయి.అందుకు తగ్గట్టుగానే అవి మనకు ఎంజాయ్ చేశాయి.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సీన్ జరగడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా అటువైపు చూస్తోంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటింగ్‌కు చివరిలో దిగిన టీమ్‌కు గెలవడానికి భారీ టార్గెట్ ఉన్నప్పటికీ చివరి ఓవర్‌లో ఆ బుడ్డోడు చేసిన మ్యాజిక్ కు మ్యాచ్ ఫలితమే మారిపోయిందని చెప్పాలి.
రీసెంట్ గా ఇర్లాండ్ ఎల్‌వీఎస్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ క్రెగాగ్ అలాగే బాలీమెనా మధ్య జరగడంతో ప్రపంచ క్రికెట్ అభిమానులు మొత్తం ఈ మ్యాచ్ దిక్కు చూసేలా చేశాడు ఆ బుడ్డోడు.ఇక ఈ పొట్టి ఫార్మాట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన క్రెగాగ్ మ్యాచ్లోని 20 ఓవర్లకు 147 రన్స్ చేయగా అవతలి జట్టుకు ఇది పెద్దగా కనిపించలేదు.కానీ ఈ చిన్న టార్గెట్‌ను కూడా చేధించలేక 19 ఓవర్లకే బాలీమెనా జట్టు ఏకంగా ఏడు వికెట్లు నష్టపోయి 113 రన్స్ చేసి తీవ్ర కష్టాల్లో ఉండగా ఇక లాస్ట్ ఓవర్‌కు 35 రన్స్ కావాల్సి ఉంది.
ఇక క్రీజ్‌లో ఉన్న గ్లాస్(87) మ్యాజిక్ ఆటతో ఏకంగా 6 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.