ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైసిపిలో చక్రం తిప్పేందుకు ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉండేవారు.జగన్ దగ్గర ఆయన హవా అంతగా సాగేది.
ఇప్పటికీ అత్యంత కీలకమైన కోస్తా జిల్లాల పార్టీ బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు.జగన్ కు చేదోడువాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు.
అయితే ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని జగన్ నియమించారు.ఆ పదవి కాలం పూర్తయింది.
అయితే మరోసారి రెన్యూవల్ చేసేందుకు జగన్ ప్రయత్నించే క్రమంలో వైవీ పరోక్షంగా తనకు ఆ పదవి చేపట్టడం ఇష్టం లేదని, మంత్రి అవ్వాలనే తన కోరికను జగన్ వద్ద అనేక సార్లు ప్రస్తావించినా, జగన్ మాత్రం లైట్ తీసుకున్నట్టు గానే వ్యవహరించారు.
తాజాగా పెద్దఎత్తున నామినేటెడ్ పదవులను జగన్ భర్తీ చేశారు.
వీటిలో వైవి సుబ్బారెడ్డి ని మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ నియమించారు.దీంతో వైవి కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
అయితే పైకి జగన్ తనకు ఏ పని అప్పగించినా నిర్వహిస్తానని చెబుతున్నా, వైవికి మనసులో మాత్రం మంత్రి పదవి పైనే ఆశలు ఉన్నాయట.మరో రెండున్నర ఏళ్ల పాటు నామినేటెడ్ పదవి కే పరిమితం అయిపోతే ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించలేని పరిస్థితి ఉంటుందనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది.
వాస్తవంగా 2019 ఎన్నికల సమయంలోనే ఒంగోలు నుంచి ఎంపీగా సుబ్బారెడ్డి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే చివరి నిమిషంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కి ఆ సీటు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించడంతో, తప్పేది లేక ఆ సీటును సుబ్బారెడ్డి వదులుకున్నారు.అధికారంలోకి వైసిపి వచ్చిన తర్వాత ఆయనకు టిటిడి చైర్మన్ పదవి ఇచ్చినా, వైవి లో మాత్రం అసంతృప్తి నెలకొందట.ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిపదవులో కూర్చోవాలి అనేది వైవీ ఆకాంక్షట.
కానీ జగన్ పాత పదవే ఇచ్చి బాగానే నిరాశపరిచినట్టుగా కనిపిస్తున్నారు.