భూమి మీద పుట్టిన మానవులలో చాలా మంది వివాహం చేసుకునేందుకు అధిక ప్రధాన్యం ఇస్తారు.పూర్వపు రోజుల్లో చాలా సింపుల్ గా జరిగే పెళ్లిళ్లు నేడు మాత్రం చాలా ఆడంబరంగా జరుగుతున్నాయి.
అసలు కరోనా వచ్చి ఆడంబరాలను దెబ్బతీసింది కానీ లేకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.ప్రీ వెడ్డింగ్ షూట్ లని చెప్పి వేలకు వేలు తగలేస్తూ… చేసే నానా హంగామాలను మనం చూస్తూనే ఉన్నాం.
పాత తరం వారు ఇవన్నీ ఎందుకని వారించినా… సరే కొంత మంది వినకుండా ఈ షూట్ లు ప్లాన్ చేస్తుండడం గమనార్హం.ఇలా లేని పోని ఆడబంరాల పేరిట అప్పులు చేసి యువత తిప్పలు పడుతున్నారు.
ఓ వరుడు పెళ్లి సమయంలో వధువు అందానికి ముగ్ధడై అక్కడే కింద పడిపోయే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఇంతకీ అసలేంజరిగిందంటే…
పెళ్లి వేదికపై ఉన్న అబ్బాయి అమ్మాయి రావడం చూసి.తన అందానికి కింద పడిపోతుంటాడు.
ఇది చూసిన చుట్టుపక్కల వాళ్లు అతడిని పడిపోకుండా పట్టుకుంటారు.అయితే తన అందం వల్లే ఇదంతా జరిగిందని తెలిసిన వధువు సిగ్గపడుతుంది.
ముసిముసిగా నవ్వుతుంది.మరో విషయమేంటంటే వరుడు అలా వధువు అందాన్ని చూసి కింద పడిపోతున్న సమయంలో బాలీవుడ్ చిత్రం మెయిన్ హూ నా లోని తుమ్‌సే మిల్‌కె దిల్ హ హాల్ అనే పాట ప్లే అవుతుంది.
ఇలా పాటను కూడా ప్లే చేయడంతో సన్నివేశానికి ఎక్కడ లేని రొమాంటిక్ ఫీల్ వచ్చింది.ఇది చూసిన నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ వీడియోను 15 వేలకు పైగా మంది వీక్షించారు.ఈ వీడియోలో ఉన్న జంట చూడముచ్చటగా ఉందని దీవిస్తున్నారు.