సినిమాల్లో పవన్ కళ్యాణ్ చూపించే ఆటిట్యూడ్ అంటే చాలా మందికి ఇష్టం.ఆ ఆటిట్యూడ్ తోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనకంటూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.పవన్ స్టయిల్, తన మ్యానరిజం వంటివి ఆయనను సూపర్ స్టార్ ను చేసాయి.
ఆయన సినిమాలంటే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి.
అయితే ఆయన ఆటిట్యూడ్ ను మాత్రం పూర్తిగా బయటకు తీసింది పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి.
ఆయన పవర్ స్టార్ తో చేసిన బద్రి సినిమాలో పవన్ ఎనర్జీ, తన స్టయిల్ కానీ ఇప్పటికి అభిమానుల గుండెల్లో నిలిచి పోయాయి.అలంటి ఆటిట్యూడ్ ను మళ్ళీ బయటకు తీస్తా అంటున్నాడు హరీష్ శంకర్.
హరీష్ శంకర్ తో పవన్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసందే.
తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసారు.ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో హరీష్ బద్రి వీడియోను పోస్ట్ చేస్తూ బద్రి లోని పవన్ ను మళ్ళీ బయటకు తీస్తా అని ఆయన ట్వీట్ చేసారు.
మరి చూడాలి పవన్ ను ఎంత ఎనర్జిటిక్ గా ప్రెసెంట్ చేస్తారో.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలో నటిస్తున్నాడు.
దీంతోపాటు రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది.యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత పవన్ హరీష్ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.