తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడు లేని చురుకుదనం కనిపిస్తుందనే ఊహలు మొదలయ్యాయట.దీనికి కారణం త్వరలో హుజురాబాద్లో జరగబోతున్న ఉప ఎన్నిక కారణం అని అనుకుంటున్నారట.
ఇక ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.కాగా హుజురాబాద్ నియోజక వర్గం లో బిజేపీని బలపరచడానికి ప్రయత్నిస్తున్న ఈటలను అడ్డుకోవడానికి కారు పార్టీ నేతలు కూడా గట్టిగానే ఆలోచిస్తున్నారట.
ఇదిలా ఉండగా దళితుల సమస్యలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి టీడీపీని ఆహ్వానించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగమే అంటూ, కేసీఆర్ ఆధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల్ని మోసం చేస్తు పదవులు అనుభవిస్తున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారట.
ఇకపోతే బీజేపీ కూడా ఈ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.