తెలంగాణాకు రావాల్సిన నిధులను విడదల చేయాలని కోరుకుంటూ తెలంగాణా మంత్రి కే.టి.
ఆర్ కేంద్ర ఆర్ధిక్ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ ఆధిక ప్యాకేక్ ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారు.
అయితే అది ప్రకటించి ఏడాది అవుతున్న నిధులు విడుదల చేయలేదని లేఖలో గుర్తుచేశారు కే.టి.ఆర్.వివిధ రంగాలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని.ఈ ప్యాకేజ్ ద్వారా తెలంగాణా తయారీ రంగానికి కీలకమైన సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.కేంద్రం ప్రకటించిన ఆకర్షణీయ ప్యాకేజ్ లో కేంద్ర, మధ్య తరహా పరిశ్రమలకు సంబందించిన అంశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.
లాక్ డౌన్ లో చిన్న పరిశ్రమకు 80 శాతం పైగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని కే.టి.ఆర్ చెప్పారు.మీ ప్యాకేజీలలో ప్రత్యేక ఆకర్షణ లేదని ఇక్కడి ఎస్.ఎం.ఈలు భావిస్తున్నాయని తెలిపారు.ప్యాకేజీలకు సంబందించిన ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉందని అన్నారు.కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ పథకం ఉందని అన్నారు.పథకాల మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం ఉందని కే.టి.ఆర్ లేఖలో ప్రస్తావించారు.