తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు ఎంట్రీ ఖాయం అయ్యింది.ఇప్పటికే శంకర్ తో తెలుగు లో ఒక సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు మరో వైపు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.
ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇటీవలే వంశీ పైడిపల్లి మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో సినిమా ఉంటుందని స్పష్టంగా చెప్పేశాడు.
విజయ్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరో.గత నాలుగు అయిదు సంవత్సరాలుగా ఆయన ఏ సినిమా చేసినా కూడా వంద కోట్లు ఖాయం.
ఇలాంటి సమయంలో ఆయన సినిమా అంటే మామూలుగా ఉండదు.సినిమా బడ్జెట్ లో సగానికి పైగా ఆయన పారితోషికం ఉంటుంది.
అయినా కూడా ఆయనతో ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్స్ సినిమా లు చేసేందుకు సిద్దంగా ఉన్నారు.ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలు రెండు పూర్తి అయితే వంశీ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది.
సూపర్ స్టార్ విజయ్ వంద కోట్ల పారితోషికం అందుకుంటాడనే టాక్ ఉంది.ఇప్పుడు దిల్ రాజు ఏ మేరకు ఆయనకు ఆఫర్ ఇచ్చి ఉంటాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కి ముందస్తు గా 50 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నాడు.ఆ తర్వాత తమిళనాడు రైట్స్ లో సగం వరకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
అక్కడ దాదాపుగా 150 కోట్ల బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది.అంటే ఏకంగా 75 కోట్ల వరకు ఇవ్వబోతున్నాడు.
మొత్తంగా 125 కోట్ల రూపాయలు ఆయనకు పారితోషికం గా అందబోతుంది.సినిమా సక్సెస్ అయితే వసూళ్ల లో కూడా వాటా ఉంటుందని అంటున్నారు.
సూపర్ హిట్ అయితే మరో అయిదు నుండి పది కోట్ల వరకు విజయ్ అందుకునే అవకాశం ఉంటుంది.అంటే మొత్తంగా 130 కోట్ల రూపాయలు దిల్ రాజు ఆయనకు చూపించాడట.
దాంతో విజయ్ ఈ సినిమా కు ఓకే చెప్పాడని తెలుస్తోంది.