తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన ప్రముఖ హీరోయిన్ “కీర్తి రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా కీర్తి రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే కీర్తి రెడ్డి తండ్రి ఆనంద్ రెడ్డి గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు.ఈ క్రమంలో ఒకటి, రెండు సార్లు గుండె పోటుకు కూడా గురైనట్లు సమాచారం.
దీంతో గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నాడు.అయితే ఇటీవలే మరోమారు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో తాజాగా కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆనంద్ రెడ్డి మృతి గురించి తెలియజేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆనంద్ రెడ్డి గతంలో పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడంతోపాటు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో కూడా చేరాడు.
ఈ క్రమంలో 2015వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ కూడా చేశాడు.కానీ అనుకోకుండా ఓటమి పాలయ్యాడు.
అయితే తన తండ్రి మరణవార్త విన్న అనంతరం కీర్తి రెడ్డి తన కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ లో ఉన్నటువంటి తన సొంత నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.