సమ్మర్ సీజన్ లో అందులోనూ మే నెల లో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక వేసవిలో భానుడు భగ భగలను తట్టుకోవాలంటే ఖచ్చితంగా డైట్లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.
అలాంటి వాటిలో లస్సీ ఒకటి.చాలా మంది వేసవి వేడి నుంచి బయట పడేందుకు సాఫ్ట్ డ్రింక్స్ ను ఎంచుకుంటారు.
కానీ, వాటి కన్నా లస్సీనే ఆరోగ్యానికి మేలంటున్నారు వైద్య నిపుణులు.మరి లస్సీని సింపుల్‌గా ఎలా చేయాలి? లస్సీని రెగ్యులర్‌గా తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు, చెక్కెర, రోజ్ వాటర్, యాలకుల పొడి మరియు వాటర్ పోసి కవ్వంతో బాగా చిలికి చివర్లో కొద్దిగా పుదీనా వేసుకుంటే లస్సీ సిద్దమైనట్టే.ఈ లస్సీని ప్రతి రోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే వేడి దూరమై శరీరం చల్లబడుతుంది.
అలాగే వేసవిలో ఎండల కారణంగా శరీరంలో నీరంతా ఆవిరైపోతుంది.దాంతో డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు.
అయితే లస్సీ తీసుకుంటే శరీరంలోని నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.
ప్రతి రోజు చల్లచల్లని లస్సీని తీసుకుంటే ఒత్తిడి, మానసిక ఆందోళన, తలనొప్పి, చికాకు, అతి దాహం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.లస్సీ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది.
అలాగే నేటి కాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధ పడుతున్నారు.అయితే అలాంటి వారు రెగ్యులర్‌గా ఒక గ్లాస్ లస్సీ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.దాంతో జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి.ఇక లస్సీ తీసుకుంటే నీరసం, అలసట వంటి సమస్యలు దూరమై ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మారతారు.