మన పురాణాల ప్రకారం లోక కల్యాణార్థం విష్ణుమూర్తి పది అవతారాలను ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఒక అందమైన వేశ్య కడుపులో పుడతాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విధంగా విష్ణుమూర్తి వేశ్య కడుపున పుట్టడానికి గల కారణం ఆమె కోరిన కోరిక అని చెప్పవచ్చు.ఇంతకీ వేశ్య కోరిన కోరిక ఏమిటి? విష్ణుమూర్తి ఎందుకు ఆమెకు జన్మించాడు అనే విషయాలను తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఒక వేశ్య స్త్రీ గండకీ అనే పేరుతోశ్రావస్తి అను నగరంలో నివసించేది.ఆమె ఎంతో అందంగా ఉండడంతో ఎంతోమంది ధనవంతులు ఆమెను పొందాలని భావించేవారు.
ఈ క్రమంలోనే గండకి ప్రతిరోజు ఒక వ్యక్తికి మాత్రమే అనుమతి తెలిపేది.ఆరోజు మొత్తం ఆ వ్యక్తి ఆమె భర్త.
ఎలాంటి పరిస్థితులలో కూడా రెండవ వ్యక్తికి అనుమతి ఇవ్వదు.ఆమె తల్లి ఆమెను ఎన్నో విధాలుగా మార్చటానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఒకరోజు సాక్షాత్తు విష్ణు భగవానుడికి గండకీని పరీక్షించాలనే కోరిక కలిగింది.ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చి బేరమాడి కానుకలను ఇచ్చారు.
పద్ధతి ప్రకారం గండకి ఆ వ్యక్తికి స్నానం చేయించడానికి దుస్తులు తీస్తే అతనికి కుష్టి వ్యాధి ఉంది.ఆ వ్యక్తికి కుష్టి వ్యాధి ఉందని గ్రహించిన ఆమె తల్లి అతనిని తిట్టి అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని చెప్పగా, అందుకు గండకి తన తల్లి పై ఆగ్రహం చెందుతుంది.
కుష్టి వ్యాధి తో ఉన్న అతనికి సంపంగి తైలం పూసి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి చక్కటి వస్త్రాలను వేసి భోజనం పెట్టింది.అదే కంచంలోనే తాను కూడా తింటుంది.
అయితే అధికంగా జ్వరం రావడం వల్ల ఆ రోజు రాత్రి ఆ వ్యక్తి మరణించాడు.
ఏ వ్యక్తి అయినా ఒక రోజు తన భర్తగా భావించే గండకి ఆ రోజు ఆ వ్యక్తి మరణించడంతో తన భర్త మరణించినట్లుగా భావించి సతీ సహగమనానికి సిద్ధపడింది.అతని చితిపై కట్టెలను పేర్చి, చితికి మంట పెట్టి ఆ మంటలో దూకింది.ఆ సమయంలో ఎగిసిపడుతున్న మంటలు మల్లెపూలుగా మారాయి.
కాలిన కట్టెలు పువ్వులయ్యాయి.అప్పుడే లక్ష్మీ సమేతంగా శ్రీ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
విష్ణుమూర్తిని చూసిన గండకి చేతులు జోడించి స్వామి వారి పాదాలకు నమస్కరించింది.గండకి పవిత్రతకు మురిసిపోయిన నారాయణుడు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు గండకి ధనం, మోక్షం కాకుండా మాతృత్వాన్ని కోరింది.
విష్ణువుని తన కొడుకుగా పుట్టాలని వరం కోరుకుంది.ఈ క్రమంలోనే మరుసటి జన్మలో గండకి నది రూపంలో పుట్టగా అందులో విష్ణుమూర్తి సాలగ్రామాల రూపంలో పుట్టి పూజలు అందుకుంటున్నాడు.