తమిళంలో కొన్ని సీరియల్స్ లో నటించి గుర్తింపును సంపాదించుకున్న 24 సంవత్సరాల వయస్సు గల నటి జెన్నిఫర్ ఒక టీవీ సీరియల్ కు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేశారు.కారులో తనను కూర్చోబెట్టి నగ్న వీడియోను తీసి సహాయ దర్శకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని జెన్నిఫర్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా తాను టీవీ సీరియళ్లలో నటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
తాను ప్రస్తుతం చిన్న సేక్కాడు అనే ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నానని ఆమె తెలిపారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా తాను టీవీ సీరియళ్లలో నటిస్తున్నానని 2019 సంవత్సరం ఆగష్టు నెల 25వ తేదీన శరవణన్ అనే వ్యక్తిని తాను వివాహం చేసుకున్నానని అయితే కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉందని ఆమె పేర్కొన్నారు.
భర్తతో విడిపోయిన తరువాత టీవీ సీరియల్ కు సహాయ దర్శకునిగా పని చేస్తున్న నవీన్ కుమార్ అనే వ్యక్తితో తాను డేటింగ్ లో ఉన్నానని నవీన్ కుమార్ ఉద్యోగం కోల్పోవడంతో తనను డబ్బుల కోసం తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడని ఆమె చెప్పారు.ఒకసారి నవీన్ డబ్బులు అడిగినా తాను ఇవ్వకపోవడంతో తనను కారులో కూర్చోబెట్టి న్యూడ్ వీడియో తీశాడని ఆమె చెప్పుకొచ్చారు.
తాను ఆ విషయాన్ని నవీన్ తల్లి దృష్టికి తీసుకెళ్లగా తన కొడుకు నవీన్ చెప్పినట్టు వినాలని ఆమె సూచించారని జెన్నిఫర్ తెలిపారు.
పోలీసులు నవీన్ పై, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడంతో పాటు వీడియోను తనకు ఇప్పించాలని నటి ఫిర్యాదులో కోరారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.