మనం ఇప్పుడు చూసే కొద్ది మంది నటీనటులు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకముందు వాళ్ళ ఫేస్ కట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండటం మనం గమనించే ఉంటాం.ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ అనే పదం మనం తరచుగా వినేటటు వంటి ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ.
అయితే బాలీవుడ్ లో ఉన్న సినీ తారలు చాలా వరకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారే.కాని బయటకి ఈ విషయాన్ని చెప్పడానికి సాహసించరు.
ఎందుకు అనేది వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారన్నది మాత్రం అక్షరాల నిజం.అయితే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాను రచించిన పుస్తకంలో నా ముక్కులో చిన్న కణతి ఏర్పడింది.
కాని అది తీసే క్రమంలో చేసిన ఆపరేషన్ వికటించింది.మరల నాకు అది నచ్చకపోయే సరికి మరల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా అని ప్రియాంక తెలిపింది.
అయితే బాలీవుడ్ నటి అనుష్క 2006 లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన ఓ మాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని నా పెదవి చిన్నగా ఉండడంతో కొంచెం పెద్దగా కనిపించేందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని ప్రస్తుతం నేను ఇంత అందంగా కనబడ డానికి ఇదే అసలైన కారణమని అనుష్క చెప్పుకొచ్చింది.