రజినీకాంత్ కి శుభాకాంక్షలు తెలిపిన మోడీ..!!

తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు.ఈక్రమంలో అన్నాడీఎంకే పార్టీ మరో ఛాన్స్ అంటుండగా, మరోపక్క డీఎంకే పార్టీ ఒక్క చాన్స్ అంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు హోరెత్తిస్తున్నారు.

 Modi Wishes To Rajinikanth Tamilnadu, Dada Sahab Falke Award, Rajinikanth, Modi-TeluguStop.com

ఈక్రమంలో అన్నాడీఎంకే పార్టీ తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ మరోసారి అధికారం కైవసం చేసుకోవాలని అనుకుంటోంది.ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ తరఫున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.

ఇలాంటి తరుణంలో రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తో ఇప్పుడు తమిళ రాజకీయం రసవత్తరంగా మారింది.విపక్షాలు ఇదంతా ఎన్నికల స్టంట్ అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో అనేక తరాలకు అతీతంగా ఏళ్ళతరబడి అభిమానులను సంపాదించుకుని చిత్ర విచిత్ర పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తలైవా రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం నిజంగా సంతోషం అంటూ సోషల్ మీడియాలో మోడీ శుభాకాంక్షలు తెలిపారు.  ఒక్క మోడీ మాత్రమే కాక భారతీయ చలన చిత్ర రంగంలో చాలామంది రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube