బంగ్లాదేశ్ లో 2 సార్లు రిలీజయి 5 భాష‌ల్లో 6 సార్లు రిమేక్ చేయ‌బ‌డ్డ తెలుగు సినిమా

అనుకోని విధంగా అవకాశాన్ని దక్కించుకుని ‘విక్రమార్కుడు‘లా తన సత్తా చాటుకున్నాడు మాస్ హీరో రవితేజ.తొలుత వేరే హీరోని దృష్టిలో పెట్టుకొని విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ సిద్ధం చేసినా.

 Unbelievable Facts About Tollywood Movie Vikramarkudu, Vikramarkudu, Raviteja, P-TeluguStop.com

అనుకున్న హీరో ఒకే చెప్పక పోవడంతో ఆ ఛాన్స్ రవితేజ కొట్టేశాడు.బంఫర్ హిట్ సాధించాడు.

ఈ మూవీ పలు భాషల్లోకి రీమేక్ అయి.వసూళ్ల సునామీ సృష్టించింది.ఇంతకూ ఈ సినిమా స్టోరీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారు? అతడు ఏం చెప్పడం వల్ల ఈ అవకాశం చేజారింది? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

విజయేంద్ర ప్రసాద్.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో స్టోరీ రాశాడు.ఈ క్యారెక్టర్ కు పవన్ కళ్యాణ్ అయితే సూపర్ గా ఉంటుందని రాజమౌళితో చెప్పాడు.

వెంటనే జక్కన్న ఈ స్టోరీని పవర్ స్టార్ కు చెప్పాడు.స్టోరీ విన్న పవన్ కొద్ది రోజులు సినిమాలకు దూరం ఉండాలి అనుకుంటున్నట్లు చెప్పాడు.

వెంటనే ఈయన ప్లేస్ లో మరో హీరోను పెట్టుకొని సినిమా చేయాలి అనుకున్నాడు.ఆ సమయంలోనే రవితేజ.

రాజమౌళికి గుర్తొచ్చారు.

రవితేజకు వెంటనే స్టోరీ వినిపించాడు రాజమౌళి.

రవితేజ ఒకే చెప్పాడు.పోలీస్ క్యారెక్టర్ తో పాటు రవితేజకు మంచి కామెడీ క్యారెక్టర్ వచ్చేలా చూడాలని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు చెప్పాడు.

కొద్ధి రోజుల్లోనే ఆయన అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ సృష్టించారు.ఈ సినిమాకు హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేశారు.

పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కు అజయ్ ని ఒకే చేశారు.అన్ని సెట్ అయ్యాక 2005 మూవీ షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా ప్రారంభం రోజున ఎన్టీఆర్, ప్రభాస్ చీఫ్ గెస్టులుగా వచ్చారు.మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.2006లో 180 ప్రింట్స్ తో మూవీ విడుదల అయ్యింది.

Telugu Vikramarkudu-Telugu Stop Exclusive Top Stories

మొదటి వారంలో డివైడ్ టాక్ వచ్చింది.ఆ తర్వాత హిట్ టాక్ తో దూసుకుపోయింది.మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ ఈ మూవీ నచ్చింది.

పాటలు, ఫైట్స్, డైలాగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.రవితేజ కామెడీకి తోడు హీరోయిజం ప్రేక్షకులను అలరించాయి.రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.26 కోట్లను వసూలు చేసింది.54 సెంటర్లలో 100 రోజులు ఆడింది.రవితేజ, అనుష్కకు మంచి గుర్తింపు తెచ్చింది ఈ మూవీ.ఈ సినిమా పలు భాషల్లోకి రీమేక్ అయ్యింది.కన్నడ, తమిళ్, బెంగాలీ, హిందీతో పాటు బంగ్లాదేశ్ బాషల్లో ఈ సినిమా రూపొందించారు.బంగ్లాదేశ్ లో వేర్వేరు నటీ, నటులతో రెండుసార్లు రీమేక్ చేశారు.

రిలీజ్ అయిన ప్రతి చోటా ఈ సినిమా బంఫర్ హిట్ అయ్యింది.వసూళ్ల సునామీ సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube