మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.మలయాళంలో రూపొందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ఈ రీమేక్ ఇటీవలే ప్రారంభం అయ్యింది కనుక ఈ ఏడాది చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు.కాని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను సమ్మర్ చివర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట.
మలయాళం దృశ్యం 2 సినిమా విడుదల అయ్యి ఇప్పటికే అమెజాన్ లో కుమ్మేస్తుంది.తెలుగు భాష రాని వారు కూడా చూస్తున్నారు.
సినిమా కథ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అందుకే రీమేక్ ను ఆలస్యం చేయడం వల్ల ఫీల్ పోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ దృశ్యం 2 తెలుగు రీమేక్ ను కేవలం రెండు నెలల వ్యవధిలోనే తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 సినిమా కోసం వెంకటేష్ కేవలం 25 నుండి 30 రోజులు మాత్రమే పని చేయబోతున్నాడు.అంటే నెల రోజుల్లోనే సినిమా పూర్తి అవుతుంది.
సాధ్యం అయినంత వరకు 25 రోజుల వర్కింగ్ డేస్ తోనే పూర్తి చేస్తారని అవసరం అయితే మరో అయిదు రోజుల వరకు వెంకీని వాడుకుంటారని అంటున్నారు.పైగా ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే దృశ్యం 2 సినిమా షూటింగ్ కు వెంకీ హాజరు అవుతున్నాడు.
అంటే ఆడుతూ పాడుతూ సింపుల్ గా దృశ్యం 2 సినిమా ను పూర్తి చేయబోతున్నాడు.ఇప్పటికే తెలుగు లో దృశ్యం సక్సెస్ అయ్యింది.కనుక దృశ్యం 2 సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.అందుకే సినిమా ను మరీ ఎక్కువ రోజులు సాగతీయకుండా జూన్ లో విడుదల చేస్తారని చెబుతున్నారు.
పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.