టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ను కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని హిట్టు ప్లాపు లతో సంభంధం లేకుండా వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు.ఈ సినిమా లో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది.
ఈ సినిమాను కొత్త తరహాలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్ గా పని చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్, టీజర్ వంటివి జనాలను బాగానే ఆకట్టుకున్నాయి.ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మంచి ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.రావు రమేష్, మురళీ శర్మ వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు అనగా మార్చి 9 న సాయంత్రం 5.30 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరవుతున్నారు.ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే తమ అభిమాన హీరోను డైరెక్ట్ గా చూసి చాలా రోజులు అయ్యింది.అందుకే బన్నీ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.