టీడీపీలో ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు ప‌ద‌వులు... పార్టీని నిల‌బెట్టేనా ?

తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నిక‌ల వేళ అధికార వైఎస్సార్ సీపీకి ధీటైన పోటీ ఇస్తోంది.ప‌లు చోట్ల టీడీపీ కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 Tdp Gave Incharge Positions To Valavala Mallikarjuna Rao And Ke Prabhakar, The P-TeluguStop.com

ఇక ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపికి చాలా చోట్ల ఇన్‌చార్జ్‌లు లేరు.గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోన్న చంద్ర‌బాబు తాజాగా ఇన్‌చార్జ్‌లు లేని మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను ప్ర‌క‌టించారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెం ఇన్‌చార్జ్‌గా వ‌ల‌వ‌ల మ‌ల్లిఖార్జున రావు (బాబ్జీ) ని నియ‌మించిన చంద్ర‌బాబు క‌ర్నూలు జిల్లాలో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న డోన్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ.ప్ర‌భాక‌ర్‌ను నియ‌మించారు.

తాడేప‌ల్లిగూడెంలో చివ‌రి సారిగా 1999లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది.అప్ప‌టి నుంచి ఆ పార్టీ ఓడిపోతూ వ‌స్తోంది.గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని యాక్టివ్ గా లేరు.దీంతో చంద్ర‌బాబు బాబ్జీకి పార్టీ ప‌గ్గాలు అప్పగించారు.

ప‌శ్చిమ జ‌డ్పీ మాజీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు సైతం ఈ సీటు ఆశించినా.చంద్ర‌బాబు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా కాపు వ‌ర్గానికి చెందిన బాబ్జీకే పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.

ఇక క‌ర్నూలు జిల్లాలోని డోన్ కేఈ ఫ్యామిలీకి పెట్ట‌ని కోట‌.

Telugu Ap, Buganna, Chandra Babu, Latest, Pattikonda, Prabhakar, Sujathamma, Tdp

అయితే 2014, 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పార్టీ ఓడిపోతూ వ‌స్తోంది.ఇక్క‌డ మంత్రి బుగ్గ‌న తిరుగులేకుండా దూసుకుపోతున్నారు.దీంతో పార్టీని నిల‌బెట్ట‌డం కోసం ప్ర‌భాక‌ర్‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.1999లో ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు.2009లో ఆయన  పత్తికొండ నుంచి పోటీచేసి గెలిచారు.2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీచేసి ఓడిపోవడంతో.2019లో ప్రభాకర్‌ను డోన్ నుంచి పోటీచేసి చేయించగా ఓడిపోయారు.ఇక ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయ‌న కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నా.తాజాగా చంద్రబాబు ఆయ‌న‌కే డోన్ ప‌గ్గాలు ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube