జీ‌హెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఖర్చు ఎంతో తెలుసా?

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన సరే కోట్లలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు.ఎం‌ఎల్‌ఏ, ఎం‌పి ఎలక్షన్స్ మాదిరి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు.

 Do You Know How Much Amount Spend In Ghmc Elections, Bjp, Ghmc, Hyderbad Ghmc El-TeluguStop.com

ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్స్ ల్లో సుమారుగా 700 కోట్ల వరకు ఖర్చు పెట్టారని సమాచారం.అధికార పార్టీ అయిన టి‌ఆర్‌ఎస్ ఒక్కో డివిజన్ 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని వేరే పార్టీకి చెందిన నాయకులు అనుకుంటున్నారు.

తెలంగాణలో ప్రదాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు ఆదిష్ఠానం నుండి ముడుపులు అందకపోవడంతో ఆ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు తమ సొంత ఖర్చు తో పోటీ చేశారు.తెలంగాణలో ఎలాగైనా జెండా పాతలని చూస్తున్న బి‌జే‌పి పార్టీ కూడా ఏమాత్రం తక్కువ ఖర్చు చెయ్యలేదు.

పక్క రాష్ట్రం కర్నాటకలో బి‌జే‌పి అధికారంలో ఉండటంతో అక్కడి నుండి భారీగానే నిదులు సమకూరినట్లుగా తెలుస్తుంది.ఒక్కో డివిజన్ కు కోటి రూపాయలను ఖర్చు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు.

అలా 150 డివిజన్లల్లో పోటీ చేసి టి‌ఆర్‌ఎస్ కు సవాల్ విసిరింది.ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్దులు మాత్రం కార్యకర్తల తిండికి, మందుకి, ప్రచారా వెహికిల్ వాటికి పెట్రోల్ లకు గట్టిగానే ఖర్చు చేశారు.

అన్నీ పార్టీలు కలిపి 700 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.ఒక్క తెలంగాణలోనే కాదు ఎక్కడ ఎన్నికలు జరిగిన అధికార ప్రతి పక్ష నాయకులు డబ్బులను ఎర గా చూపి ప్రజలనుండి ఓట్లు కొనుకుంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube