జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖర్చు ఎంతో తెలుసా?
TeluguStop.com
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన సరే కోట్లలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు.ఎంఎల్‌ఏ, ఎంపి ఎలక్షన్స్ మాదిరి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు.
ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన జిహెచ్‌ఎంసి ఎలక్షన్స్ ల్లో సుమారుగా 700 కోట్ల వరకు ఖర్చు పెట్టారని సమాచారం.
అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్ ఒక్కో డివిజన్ 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని వేరే పార్టీకి చెందిన నాయకులు అనుకుంటున్నారు.
తెలంగాణలో ప్రదాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు ఆదిష్ఠానం నుండి ముడుపులు అందకపోవడంతో ఆ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు తమ సొంత ఖర్చు తో పోటీ చేశారు.
తెలంగాణలో ఎలాగైనా జెండా పాతలని చూస్తున్న బిజేపి పార్టీ కూడా ఏమాత్రం తక్కువ ఖర్చు చెయ్యలేదు.
పక్క రాష్ట్రం కర్నాటకలో బిజేపి అధికారంలో ఉండటంతో అక్కడి నుండి భారీగానే నిదులు సమకూరినట్లుగా తెలుస్తుంది.
ఒక్కో డివిజన్ కు కోటి రూపాయలను ఖర్చు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు.అలా 150 డివిజన్లల్లో పోటీ చేసి టిఆర్‌ఎస్ కు సవాల్ విసిరింది.
ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్దులు మాత్రం కార్యకర్తల తిండికి, మందుకి, ప్రచారా వెహికిల్ వాటికి పెట్రోల్ లకు గట్టిగానే ఖర్చు చేశారు.
అన్నీ పార్టీలు కలిపి 700 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.ఒక్క తెలంగాణలోనే కాదు ఎక్కడ ఎన్నికలు జరిగిన అధికార ప్రతి పక్ష నాయకులు డబ్బులను ఎర గా చూపి ప్రజలనుండి ఓట్లు కొనుకుంటున్నారు.
డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!