ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మందుల వాడకం కంటే చాలా మంది ఎక్కువగా ఆయుర్వేద సంబంధించిన చికిత్స ప్రాముఖ్యతను చూపిస్తున్నారు.ప్రకృతి నుంచి లభించే ఔషధ మొక్కల ద్వారా మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులను నయం చేసుకోవచ్చు.
ఔషధ మొక్కలు అంటే ఏవో సపరేట్ గా ఉంటాయి అని అనుకోవద్దు. సృష్టిలో ఉన్న ప్రతి చెట్టుకు ఔషధ మొక్కనే.
ప్రతి మొక్కలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండనే ఉంటాయి.అయితే ఆ మొక్కలు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని తెలుసుకోవడం ద్వారా మనం ఎంతో నష్ట పోతున్నాం.
ఇలా మనకు సులువుగా దొరికే మొక్కల్లో ఒకటి తిప్పతీగ ప్రధానమైనవి.
ఈ తిప్ప తీగ ను ఆయుర్వేద మందుల తయారీలలో ఎంతగానో ఉపయోగిస్తారు.మనిషికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ప్రయోజనాలు కలిగిస్తాయి.ముఖ్యంగా ఈ మొక్కకు సంబంధించిన ఆకులను చూర్ణం గా చేసుకుని తీసుకోవడం ద్వారా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ ల నుండి బయటపడవచ్చు.
ఈ ఆకులలో ఎక్కువగా యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి.
ఈ తిప్ప తీగకు సంబంధించి ఆకులను పొడిగా చేసుకొని ఆ పొడిని బెల్లంతో కలుపుకొని తీసుకోవడం ద్వారా శరీరంలో జీర్ణవ్యవస్థకు ఎంతగానో మెరుగుపరుస్తుంది.
వీటితో పాటు ఏదైనా అజీర్తి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.మధుమేహరోగులు తిప్పతీగ చూర్ణం తీసుకోవడం ద్వారా చాలా బాగా షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.మానసిక సమస్యలు వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే వారు ఈ ఆకును తీసుకోవడం ద్వారా వాటి నుండి కూడా బయట పడవచ్చు.వీటితో పాటు శ్వాసకోస సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి ఈ తిప్పతీగ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది.
వీటితో పాటు గోరువెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణం కలుపుకొని తాగడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చు.