ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.అందుకోసమే ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
మన ఇంట్లో శుభ్రంగా ఉంటే అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.కానీ కొన్ని ఇళ్ళలో మాత్రం స్త్రీలు ఎప్పుడు వాదన చేస్తూ, రోదిస్తూ ఉంటారు.
అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
మరికొందరు ఎంగిలి గిన్నెలు, కంచాలు వంటివాటిని రాత్రిపూట కడగకుండా అలాగే పెడుతుంటారు.
ఇలాగా ఎంగిలి కంచాలు ఇంటిలో ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించదు.మరికొంతమంది ఇంటిలో ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారు.
సంధ్య వేళ లో నిద్రపోతే ఆ ఇంటికి పరమ దరిద్రం ఏర్పడుతుంది.ఇలాగా ఏ ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో మహాలక్ష్మి కొలువై ఉండదని చెప్పవచ్చు.
లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే మన ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకుని, నిత్య దీపారాధన చేయాలి.అలాగే దేవుని గదిలో ఒక చిన్న తాబేలును నీటితో ఉన్న ఒక గాజు గ్లాసులో వేసి ఈశాన్య దిక్కున పెట్టడం ద్వారా ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.అలాగే తామర వత్తులతో దీపారాధన చేయడం ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి బాధిస్తున్న దరిద్రం వెళ్లిపోతుంది.ప్రతిరోజు సంధ్యాసమయంలో తామర వత్తులు గుమ్మానికి ఇరువైపులా వెలిగించాలి.అంతేకాకుండా 13 తామర వత్తులు కలిపి ఒక వత్తి గా తయారు చేసుకోవాలి.ఇలా 8 వత్తులను తయారు చేసుకుని, వాటిని ఒక పద్మంలా తయారు చేసి వెలిగించడం ద్వారా, దరిద్రం మన దరిదాపుల్లో రాకుండా, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మన ఇంటి లో విలయతాండవం చేస్తుందని వేద పండితులు చెబుతున్నారు.