చిన్నా, పెద్ద తేడా లేకుండా చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్య అధిక బరువు.ఈ అధిక బరువు వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.
అందుకే బరువును తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.అయితే అధిక బరువును తగ్గించడంలో లెమన్ గ్రాస్ అద్భుతంగా సహాయపడుతుంది.
లెమన్ గ్రాస్‌లో లెమన్ ఉన్నంత మాత్రానా.నిమ్మకాయకు దీనికి ఎలాంటి సంబంధం లేదు.
గడ్డి మొక్కలా ఉండే ఈ లెమన్ గ్రాస్‌ను తాజాగా వాడొచ్చు లేదా ఎండబెట్టి పొడి చేసుకుని అయినా వాడొచ్చు.
అయితే అధిక బరువు తగ్గాలనుకునే వారు లెమన్ గ్రాస్‌ను జ్యూస్‌లలో మిక్స్ చేసి తీసుకుంటూ ఉండాలి.ఇలా తరచూ చేయడం వల్ల శరీరంలో పెరుకుపోయి ఉన్న కొవ్వు పదార్థాలు కరిగిపోయి. బరువును నియంత్రణలోకి తెస్తుంది.
లెమన్ గ్రాస్‌తో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ప్రస్తుత కాలంలో చాలా మంది జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి వారు లెమన్ గ్రాస్ తీసుకోవడం వల్ల సులువుగా ఉపశమనం లభిస్తుంది.లెమన్ గ్రాస్ డ్రింక్ తాగడం వల్ల.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపేలా చేస్తుంది.లెమన్ గ్రాస్‌లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీర రోగ నిరోధక శక్తి పెంపొందించి.రకరకాల వైరస్‌లు దరి చేరకుండా చేస్తుంది.
అదేవిధంగా, లెమన్ గ్రాస్ తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ముఖ్యంగా గుండె పోటు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది.మరియు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.
అదే సమయంలో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి.