ఓరి దేవుడా... బౌలర్ రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అంటున్న గూగుల్..!

భారతదేశంలో పేరు పొందిన జంటగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గురించి ఎన్నో కథనాలు మనం చూస్తూనే ఉంటాం.ఇకపోతే వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.

 Rashid Kahn, Anushka Sharma, Instragram, Ipl,ilp 2020, Sunrisers-TeluguStop.com

ఎవరైనా సరే గూగుల్ ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ భార్య ఎవరిని అడగగా గూగుల్ దానికి సమాధానంగా నటి అనుష్క పేరును చూపిస్తోంది.అవును కావాలంటే మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి.

గూగుల్ సెర్చ్ లో కి వెళ్లి రషీద్ ఖాన్ వైఫ్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి.

అలా సెర్చ్ చేయగా వచ్చిన ఆన్సర్ చూస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే.

రషీద్ ఖాన్ వైఫ్ సంబంధించి సెర్చ్ లో అనుష్క శర్మ పేరు కనిపించడమే కాకుండా ఆమె ఫోటోలు కూడా దర్శనమిస్తాయి.నిజానికి ఇప్పటివరకు రషీద్ ఖాన్ కు అసలు పెళ్లి కాలేదు.

భారతదేశంలో ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అని.అలాంటి విషయాన్ని గూగుల్ ఎలా తప్పు చెబుతోంది అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Telugu @sunrisers, Anushka Sharma, Ilp, Instragram, Rashid Kahn-Latest News - Te

అయితే ఇందుకు ఓ చిన్న కారణం లేకపోలేదు.ఇది వరకు ఒకసారి రషీద్ ఖాన్ లైవ్ సెషన్ లో భాగంగా కొందరు ఫ్యాన్స్ తనకి బాలీవుడ్ లో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా దానికి సమాధానం గా రషీద్ ఖాన్ తనకి అనుష్క శర్మ, ప్రీతి జంట అంటే ఇష్టమని తెలిపాడు.దీంతో అప్పట్లో రషీద్ ఖాన్ కు ఫేవరెట్ యాక్టర్ అనుష్క శర్మ అని ఎన్నో వార్తలు ట్రెండింగ్ అయ్యాయి.దీంతో అప్పటి నుంచి రషీద్ ఖాన్ భార్య గూగుల్ ఇలానే చూపిస్తుందట.

ఇకపోతే ప్రస్తుతం రషీద్ ఖాన్ దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 13 వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మిస్టరీ స్పిన్నర్ గా సేవలను అందిస్తున్నాడు.ఇకపోతే ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచే వరకు తాను వివాహం చేసుకోనని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube