కోవిడ్ ఎఫెక్ట్: చెన్నై వంక చూడని ఎన్ఆర్ఐ విద్యార్థులు, భారీగా పడిపోయిన అడ్మిషన్లు

ప్రపంచాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది.నిరుపేదల నుంచి సంపన్నుల వరకు దీని బారినపడిన వారే.

 Covid Leaves Top Colleges With Fewer Nri Applicants, Nri Applicants, Anna Univer-TeluguStop.com

ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మానవాళి కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్ధితి.అన్ని దేశాలు నెమ్మదిగా ఆంక్షలను ఎత్తివేస్తున్నప్పటికీ ఇంకా పరిస్థితులు మనిషి చెప్పుచేతల్లోకి రాలేదు.

కరోనా వల్ల బాగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం కూడా ఒకటి.
ప్రతి ఏడాది లక్షల మంది విదేశీ విద్యార్ధులు, ఎన్ఆర్ఐలు ఉన్నత విద్య కోసం భారతదేశానికి వస్తారు.

అయితే కరోనా పుణ్యమా అని 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవాసుల నుంచి దరఖాస్తులు బాగా తగ్గిపోయాయి.
ఒక్క చెన్నై నగరాన్ని తీసుకుంటే ప్రఖ్యాత అన్నా యూనివర్సిటీలోని నాలుగు క్యాంపస్‌లలో ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరుల కోసం ప్రభుత్వం 300 సీట్లను కేటాయించింది.

ప్రతి ఏడాది ఇక్కడ ప్రవేశాల కోసం సుమారు 500 మంది ప్రవాసులు దరఖాస్తు చేసుకునేవారు.ప్రస్తుతం కరోనా కారణంగా కేవలం 400 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అన్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంకే.

సురప్ప తెలిపారు.ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలోని ఎన్ఆర్ఐల నుంచి గతేడాది 600 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం వేతనాల కోత, ఉద్యోగాలు కోల్పోవడం కారణంగా ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు ఇప్పటికే అన్నా యూనివర్సిటీలో చదువుతున్న తమ పిల్లల ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు.ఇక గతేడాది మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం నుంచి 130 దరఖాస్తులు వచ్చాయి.

కానీ ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 60 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఓ అధికారి తెలిపారు.అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు వున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు.

చెన్నైలోని ఇతర ప్రముఖ విద్యా సంస్థలైన లయోలా కాలేజ్, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, ఎథిరాజ్ కాలేజ్ ఫర్ వుమెన్‌ల పరిస్ధితి ఇలాగే వుంది.అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీలు కూడా దరఖాస్తుల్లో తగ్గుదలను చూశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube