సినీ ప్రముఖులు ఎప్పుడు ఏదో ఒక వార్త వల్ల సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటారు.వారు ఏది చేసినా అది న్యూసే.
అయితే బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు తెరపైకి రావడం ఇది కొత్త ఏం కాదు, గతం లో చాలా మంది సెలబ్రిటీ లు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణంతో సంబంధముందని భావిస్తున్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి గత నెలలో దీపికా పదుకొనే ను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్తోత్రాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
దీనితో పెద్ద కలకలం రేగింది.ఇప్పటికే ఎన్సీబీ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ లను విచారించింది.వీరంతా డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకించామని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి మరికొందరిని విచారించాల్సి ఉండటంతో, వీరిని తిరిగి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
ఇప్పుడు విచారణ అధికారికి కరోనా రావడంతో విచారణను ఎదుర్కొన్న సెలబ్రెటీలు అందరూ ఇప్పుడు టెస్ట్ లు చేయించుకోడానికకి సిద్ధమవుతున్నారు.