వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారన్న సంగతి తెలిసిందే.సినిమాసినిమాకు మహేష్ తన రేంజ్ ను పెంచుకోవడంతో పాటు కలెక్షన్లపరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.
అయితే మహేష్ బాబు ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపిస్తారని, హీరోగా డబుల్ రోల్ సినిమాలలో కనిపించరనే విమర్శ ఉంది.బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేసిన మహేష్ బాబు నాని సినిమాలో కొన్ని సెకన్ల పాటు డబుల్ రోల్ లో కనిపించాడు.
అయితే ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్ డబుల్ రోల్ లో మాత్రం కనిపించలేదు.అయితే మహేష్ ఫ్యాన్స్ కోరిక తీర్చాలనుకున్నాడో ఏమో కానీ పంచకట్టు, కోరమీసంతో పెదరాయుడి లుక్ లో సూపర్ గా కనిపిస్తున్నాడు.
అదే సమయంలో డబుల్ రోల్ లో అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు.అయితే ఈ డబుల్ రోల్ సినిమా కోసం కాకపోయినా తెరపై మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తే అభిమానులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది.
33 సెకండ్ల యాడ్ లో మహేష్ బాబు అన్న, తమ్ముడి పాత్రలో కనిపించాడు.మహేష్ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా అందులో ఫ్లిప్ కార్ట్ కూడా ఒకటి.
కొత్త లుక్ లో మహేష్ ను చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్ బ్రహ్మాండంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.తెలంగాణ యాసలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు చక్కగా కుదిరాయి.
వయస్సు పెరుగుతున్నా మహేష్ బాబు యంగ్ గానే కనిపిస్తున్నారు.
ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు యాడ్ లో సినిమాల కంటే గ్లామరస్ గా కనిపించడం గమనార్హం.
ప్రస్తుతం గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ నటిస్తున్నాడు.