ఫోర్బ్స్ : అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఏడుగురు భారతీయులు..

భారత దేశం నుంచీ ఎంతో మంది భారతీయులు వివిధ కారణాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.కొందరు ఐటీ ఉద్యోగాలకి, మరో కొందరు వైద్య వ్రుత్తి నిమ్మిత్తం, ఇంకొందరు వ్యాపార రీత్యా ఇలా అనేక కారణాలతో అమెరికాలో స్థిరపడినవారే.

 Forbes Magazine Released Richest Man List, Forbes Magazine , Richest Man List, J-TeluguStop.com

అయితే ఇలా స్థిరపడిన వారిలో చాలా మంది అగ్ర రాజ్యంలో రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థానాలని అధిరోహించారు.మరికొందరు అగ్ర రాజ్యంలో అత్యంత ధనవంతులుగా, తిరుగులేని వ్యక్తులుగా కీర్తి శిఖరాలు చేరుకున్నారు.

ఇలాంటి వారి జాబితాని తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది.

అమెరికాలో సుమారు 400 శ్రీమంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

ఈ లిస్టు లో సుమారు ఏడుగురు భారతీయుల పేర్లు ఉండటం గమనార్హం.ఈ ఏడుగురిలో సైబర్ సెక్యూరిటీ సంస్థకి చెందిన సిఈవో జయ్ చౌదరి, సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు రోమేస్ వాద్వాని, మరి కొందరు ఉన్నారని తెలుస్తోంది.జయ్ చౌదరి సంపాదన 6.9 బిలియన్ డాలర్లు కాగా ఆయనకీ 85వ స్థానం దక్కింది.ఇక మరొక వ్యక్తి రమేశ్ వోద్వాని 3.4 మిలియన్ డాలర్ల సంపాదనతో 238 వ స్థానంలో ఉన్నారు.

ఆన్లైన్ హోమ్ గూడ్స్ రిటైల్ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈవో అయిన నీరజ్ షా 2.8 బిలియన్ డాలర్లతో 299 వ స్థానంలో ఉన్నాడు.సిలికాన్ వ్యాలీ వెంచల్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా 2.4 బిలియన్ డాలర్ల తో 353 వ స్థానంలో ఉన్నాడు.అలాగే షేర్పా వెంచర్ మేనేజింగ్ పార్టనర్ రామ్ శ్రీరాం 2.3 బిలియన్ డాలర్ల సంపాదనతో ఉండగా ఇదే సంపాదనతో ఇంటర్ గొల్బ్ ఏవియేషన్ రాఖేస్ అగర్వాల్ కూడా నిలిచారు.అలాగే వర్క్ డే సిఈవో , సహా వ్యవస్థాపకుడు అనిల్ భుస్రీ 2.3 బిలియన్ డాలర్లతో 359 వ స్థానాన్ని దక్కించుకున్నారు.ఇదిలాఉంటే సుమారు ఏడుగురు భారతీయులు ఈ ఫోర్బ్స్ జాబితాలో చేరడంతో స్థానికంగా ఉన్న భారతీయ ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube