కరోనా నేపథ్యంలో ప్రపంచమే స్తంభించి పోయినట్లు అయిన ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ 13 వ సీజన్ రూపంలో హుషారు తీసుకువచ్చింది.ఎప్పుడో మార్చి లో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.
అయితే తాజాగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఈ మ్యాచ్ లను నిర్వహించాలి అని బీసీసీఐ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో ఒకొక్క ప్లేయర్ కూడా ఈ మ్యాచ్ లకు సిద్దమౌతున్న సమయంలో ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త తెలిసింది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లకు సర్వం సిద్దమౌతున్న సమయంలో ఐపీఎల్ నిర్వహణపై కోర్టులో పిటీషన్ నమోదు అయినట్లు తెలుస్తుంది.అయితే ఎదో మ్యాచ్ ను ఆపుచేయాలి అని పిటీషన్ వేశారు అనుకుంటే పొరపాటే, ఇంతకీ ఆ పిటీషన్ ఎందుకు వేశారంటే….
కరోనా కారణంగా ఇప్పటికే మనదేశం చాలా నష్టపోయింది.ఇప్పుడు ఐపీఎల్ కూడా ఇక్కడ జరగకపోతే ఇంకా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి యూఏఈ లో జరగనున్న ఈ ఐపీఎల్ ను మన దేశం లోనే నిర్వహించాలని బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ అడ్వకేట్ అభిషేక్ లాగో ముంబై హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.ఎప్పుడో జరగాల్సిన ఈ మ్యాచ్ లు ఇప్పటికైనా యూఏఈ వేదికగా జరుగనున్నాయి అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి పిటీషన్ దాఖలు అవ్వడం అసలు ఈ మ్యాచ్ లు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎప్పుడో మార్చి 29 న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడగా, ఆ తర్వాత భారత్ లో ఈ వైరస్ ప్రభావం ఎంతకీ తగ్గకపోవడంతో టోర్నీని యూఏఈ కి మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.ఈ మధ్యే జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశం తర్వాత ఈ లీగ్ నిర్వహించే తేదీలు అలాగే వేదికలు నిర్ణయించారు.
యూఏఈ లోని 3 వేదికలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది.