చిత్తూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.వయస్సు బేధం మరిచిపోయి ఓ ముసలాయన ఏకంగా తన మనవరాలి వయస్సున్న చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఆరుపదుల వయస్సులో ఆ వృద్ధుడి వ్యవహారంపై పలువురు నోరు వెళ్లబోసుకుంటున్నారు.పోలీసులు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో మనవరాలి వయసున్న ఏడేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఒంటరిగా ఉన్న బాలికను చూసి కామంతో రగిపోయాడు.ఇదే అదునుగా భావించి బాలికపై అత్యాచారం పాల్పడ్డాడు.బాలికను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించడంతో చిన్నారి కేకలు వేసింది.
దీంతో బాలిక అరుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
సాయంత్రానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది.
దీంతో వాళ్లు స్థానిక పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చిన వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు.అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు వచ్చిన మార్పు లేదు.
ప్రభుత్వం నిర్భయ చట్టాలు, షీటీంలు ఏర్పాటు చేసిన బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు.కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వీరిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకోవడం లేకపోతే అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరిశిక్ష విధిస్తేనే తప్ప వీరిలో మార్ప రాదని స్థానికులు అంటున్నారు.