నాలుగైదు వారాల్లో కరోనా విలయ తాండవం: ప్రజారోగ్యశాఖ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తాండవిస్తోంది.రోజురోజుకు ఈ మహమ్మరి బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది.

 Telangana, Health Directer, Corona-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న కరోనా స్థితి సామాజిక వ్యాప్తి అని చెప్పలేమని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు గురువారం సమావేశంలో తెలిపారు.రోజురోజుకు వ్యా‍ప్తి చెందుతున్న కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రజలు భయానికి గురవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేదు వార్తను వినిపించింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిలో ‍ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సామాజిక వ్యాప్తికి సంబంధించి నిర్దేశితమైన నిర్వచనం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు వెల్లడించారు.రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.దీంతో రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.దీంతో కరోనా వైద్యానికి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.

కరోనాకు సంబంధించిన యాంటీబయాటిక్స్‌ మందులు, ఇంజెక్షన్లు అన్ని కలిపి రూ.150 ఖర్చు వస్తుందని, సకాలంలో వైద్యం అందిస్తే రూ.లక్షల్లో ఖర్చు రాదని ప్రకటించారు.ఇప్పటివరకూ ప్రభుత్వాస‍్పత్రుల్లో 6500 పడకలు ఖాళీగా ఉన్నాయని, ప్రజలు అత్యవసమైతే తప్ప హైదరాబాద్‌కు రావొద్దని సూచించారు.

ఇంకో నాలుగైదు నెలల వరకు కేసులు పెరిగే సూచనలున్నాయన్నాయి.అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దన్నారు.

బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు.పెళ్లిళ్లు, ఫంక్షన్లను కొద్ది రోజులు దూరంగా ఉండాలన్నారు.

అందరూ జాగ్రత్త ఉండాలని ప్రజారోగ్య శాఖ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube