నేటి సమాజంలో యువత ఎంత మూర్ఖంగా తయారవుతున్నారో ప్రతిరోజు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి.ఇప్పటికే చాలామంది సెల్ఫీ పిచ్చోళ్ళు, టిక్ టాక్ స్టంట్లు చేసేవారు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ హఠాన్మరణం పొందారు కానీ వీరి మరణం ఇతరులకు గుణపాఠం అవ్వడం లేదు.
నేటి యువత కేవలం ఒక వీడియో, ఒక ఫోటో కోసం తమ ప్రాణాలనే రిస్క్ లో పెట్టి అందరి చేత తిట్టించుకోవడం అందరి విస్మయానికి కారణమవుతుంది.అయితే తాజాగా ఈ కోవకే చెందిన ఒక యువకుడు చేసిన విన్యాసాలు ఇంటర్నెట్ తెరపై ప్రత్యక్షమయ్యి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
భారతీయ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో 14 సెకన్ల నిడివి గల ఒక వీడియో ని పోస్ట్ చేశారు.ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా ఎత్తైన ఒక కొండ అంచున తన మునివేళ్ళపై నిల్చొని గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ మళ్లీ అదే కొండ అంచుపై ల్యాండ్ అయ్యాడు.
పొరపాటున బ్యాలెన్స్ తప్పి కొండ అంచు నుండి కింద పడిపోతే అతని ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి.ఈ విషయం తెలిసి కూడా ఈ కొండ అంచుపై ఇతను చేస్తున్న విన్యాసాలను మెచ్చుకోవాలో లేక మూర్ఖత్వం అని కొట్టిపడేయాలో నాకు తెలియడం లేదు అంటూ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా పేర్కొనగా… నెటిజనులు ఆ యువకుడిది పూర్తి మూర్ఖత్వమని బాగా తిట్టి పోశారు.