కరోనా పోరాటంలో మరో నూతన ఆవిష్కరణ కు శాస్త్రవేత్తలు తెరతీశారు.ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పింది.
జనాల మధ్య భౌతిక దూరం పాటించడం,మనుషులు,పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పాఠాలనే నేర్పింది ఈ కరోనా.మాస్క్ లను పెట్టుకొని ఇతరులతో ఎలా మెలగాలి ఇలా ఎన్నెన్నో పాఠాలు నేర్పింది.
ఇదే కరోనా శాస్త్రవేత్తలకు కూడా చాలా పాఠాలు నేర్పుతుంది.ఈ మహమ్మారిని ఎదురుకోవడానికి ఎలాంటి మందు తయారు చేయాలి,ఏది తయారు చేస్తే ఆ మందు ఏ అవయవం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి ఒక్కరూ కూడా తమకు తగ్గ పాఠాలు కరోనా వల్ల నేర్చుకుంటూనే ఉన్నారు.
కంటికి కనిపించని ఈ కరోనా వైరస్‌తో ప్రతి ఒక్కరూ కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
కరోనా బారి నుంచి కాపాడుకోవడం ఒక పోరాటం అయితే అది సోకాక దాన్నుంచి తప్పించుకోవడం మరోపోరాటం.
రెండో దానికంటే మొదటితే చాలా కష్టంగా మారింది.కరోనా ఏ రూపంలో ఎలా కాటేస్తోందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మాస్కులు, భౌతిక దూరం కొంత మేలే అయినా అవి కూడా పూర్తి ఆయుధాలేమీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొన్ని కేసుల ద్వారా ఈ విషయం తేటతెల్లం కూడా అయ్యింది.
ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు మరో ముందడగు వేసి సెన్సార్ మాస్క్ లను అభివృద్ధి చేస్తున్నారు.సెన్సార్ మాస్క్ లు ఏంటి అనుకుంటున్నారా.
ఈ మాస్క్ ధరించినప్పుడు ఎవరికైనా కరోనా ఉందంటే అది ఇట్టే పసిగట్టి లైట్లలా వెలుగుతాయట.మాస్కుల్లోని సెన్సార్లు వైరస్‌ను గుర్తించగానే అప్రమత్తవుతాయి.
తర్వాత లోపలున్న ఫ్లోరోసెంట్ సిగ్నళ్లు వెలుగుతాయి.హార్వర్డ్, మిషిగన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తున్నారు.
కరోనా పేషంట్ శ్వాస తీసుకున్నప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బయట పడుతుంది.ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తుల చెంత అతడు ఉంటే మాస్క్ వెలుగుతుంది.మరో ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను గుర్తించడానికి గతంలో ఇలాంటి వాటిని వాడారు.ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంది.అయితే ఈ మాస్క్ లను తయారు చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందట, అందుకే ఇవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో అనే విషయం పై నిపుణులు ఆలోచనలో పడ్డారు.