దొంగే దొంగని దొంగా అనడం ఎంతో విచిత్రం కదా.ఇప్పుడు అదే జరుగుతోంది అమెరికాలో.
కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచీ నేటి వరకూ కూడా ట్రంప్ చైనాపై చేస్తున్న కామెంట్స్ అందరికి తెలిసిందే.చైనా తన దేశంలో మరణించిన వారి లెక్కలు తక్కువ చేసి చూపిస్తోంది.
ఇదంతా కట్టుకదా అంటూ ట్రంప్ రోజు చేసే కామెంట్స్ అందరికి తెలిసినవే.కానీ అమెరికా సైతం తమ దేశంలో మరణించిన వారి సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోందని తాజాగా అమెరికాకి చెందిన కీలక వ్యక్తి బయట పెట్టడంతో ఇప్పుడు దొంగలు ఎవరో ప్రపంచానికి అర్ధమయ్యింది.
అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ అంటోని పౌచీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా షాక్ కి గురి చేస్తున్నాయి.అమెరికా ప్రజలని పౌచీ వ్యాఖ్యలు ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.
అమెరికా వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 83 వేలు సంభవించాయని, బాధితుల సంఖ్య 14 లక్షలు ఉందని అధికారికంగా వస్తున్న లెక్కలు తప్పని అసలు లెక్కలు ఇవే అంటూ పౌఛీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమెరికాలో మృతుల సంఖ్య లక్షకి పైమాటే నని భాదితుల సంఖ్య ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగానే ఉంటుందని పౌచీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.ఎంతో మంది కరోనా బాధితులు న్యూయార్క్ నగరంలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయని ఎంతో మంది కరోనా బాధితులని చేర్చుకోవడానికి హాస్పటల్స్ లో ఖాళీలు లేవని ఈ కారణంగా వారు ఇళ్లకే పరిమితం అయ్యారని తద్వారా చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉందని.ఈ విషయాలని ఎవరూ బయటపెట్టలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
.