పదిరోజుల తర్వాత టాలీవుడ్‌లో ఏం జరుగబోతుంది?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి రోజులు ఎప్పుడు రాలేదు.

 After Ten Days Whats Going On In Tollywood-TeluguStop.com

ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు కరోనా అనే పదానికి భయ పడుతోంది.కరోనా వైరస్‌ నుండి దూరంగా ఉండేందుకు ఎక్కడిక్కడ ఉండాలంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

ఇప్పటికే థియేటర్లు మార్చి 31 వరకు మూసేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.గతంలో ఎప్పుడు లేనిది అత్యంత దారుణమైన పరిస్థితులను సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది.

Telugu Coronaeffect, Telanganacinima, Telangana-Movie

తెలుగు సినిమాలు ఎన్నో కరోనా కారణంగా కకలా వికలం అవుతున్నాయి.సమ్మర్‌లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.చిన్నా పెద్ద సినిమాలు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడో సందేహం తొలుస్తుంది.థియేటర్ల మూసివేత మార్చి 31 వరకు అన్నారు.

మరి అప్పటి వరకే ఉంటుందా ఇంకా ఎక్కువ ఉంటుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Coronaeffect, Telanganacinima, Telangana-Movie

ఏప్రిల్‌ 1 వ తారీకు నుండి థియేటర్లు ఓపెన్‌ అవుతాయా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.పరిస్థితి రోజు రోజుకు సీరియస్‌గా మారుతున్న ఈ సమయంలో ఏప్రిల్‌ 1వ తారీకున థియేటర్లు రీ ఓపెన్‌ అవ్వడం సాధ్యం అయ్యే పని కాదుంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మరో పది రోజులకు పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చే అవకాశం లేదని, కనుక ఏప్రిల్‌ మొదటి వారం లేదా రెండవ వారం వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదు అంటున్నారు.

ఏప్రిల్‌ 2న నిశబ్దం ఇంకా పలు చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.కాని అవి వాయిదా పడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube