ఇటీవలకాలంలో మహమ్మారి కరోనా వైరస్ చైనా దేశంలో విజృంభిస్తే ఇప్పటికే వేల సంఖ్యలో మరణించారు.అంతేగాక ఈ వ్యాధి లక్షణాలు సోకి పలువురు ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
అయితే తాజాగా ఈ వైరస్ భారతదేశంలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది.అంతేగాక అధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు గా ఐదు కరోనా వైరస్ కేసులు నమోదైయినట్లు సమాచారం.
దీంతో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ వైరస్ ని అంతమొందించేందుకు మందు కనిపెట్టాలని అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ కరోనా వైరస్ విరుగుడుకి సంబంధించి కొన్ని వార్తలు నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆల్కహాల్ సేవించడం వల్ల వైరస్ సోకదంటూ పలు వదంతులు పుట్టిస్తున్నారు.దీంతో ఈ వైరస్ ను చూసి భయపడుతున్నటువంటి కొందరు మద్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు.
దీంతో మద్యం వ్యాపారులు మాత్రం బాగానే లాభపడుతున్నారు.అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వైద్య శాస్త్రవేత్తలు మద్యంతో కరోనా వైరస్ ని తగ్గించాలంటూ కొట్టిపారేశారు.
అంతేగాక గతంలో పలువురు వైద్యులు ఆల్కహాల్ కలిసినటువంటి లిక్విడ్ లను ఉపయోగించి చేతులను శుభ్రంగా కడుక్కోవడం వలన కొంతమేర ఈ వైరస్ సోకకుండా అరికట్టవచ్చని చెప్పారు.దీంతో వక్రీకరించి రాసినటువంటి కొన్ని వార్తలను చదివిన యువకులు ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానం అయినటువంటి తిరుపతి శ్రీవారి ఆలయంలో కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తి ప్రవేశించాడంటూ పలు వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.అయితే అందుకు గానూ తైవాన్ కి చెందినటువంటి ఆ వ్యక్తిని పరిశీలించిన అనంతరం వైద్యులు కరోనా వైరస్ సోకే లేదంటూ నిర్ధారించారు.దీంతో లేనిపోనివి ఊహించుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ పలువురు వైద్యులు సూచిస్తున్నారు.