ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
అందుకే ఒంట్లో కొవ్వును కరిగించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.కఠినమైన డైట్లను ఫాలో అవ్వడంతో పాటు జిమ్‌లో చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తుంటారు.
మీరూ ఈ లిస్ట్‌లో ఉన్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీరు తాగాల్సిందే.ఎందుకంటే, ఆ డ్రింక్ మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్‌ను మరింత వేగంగా బర్న్ చేస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా నీటిలో కడిగిన ఒక నిమ్మ పండును తీసుకుని.పై పీల్‌ను మాత్రం తురుముకోవాలి.అలాగే పొట్టు తొలగించిన అల్లం ముక్కను కూడా సన్నగా తురుముకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము, నిమ్మ తొక్కల తురుము వేసి పది నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని.గోరు వెచ్చగా అయిన తర్వాత అందులో వన టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్ మరియు పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై ఈ డ్రింక్‌ను బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి గంట ముందు సేవించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోయి మీ శరీరం నాజూగ్గా మారుతుంది.అంతేకాదండోయ్, ఈ డ్రింక్‌ను రెగ్యులర్‌గా తాగితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు కీళ్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.