ఇటీవల కాలంలో అమ్మాయిలు మేకప్‌కు బాగా అలవాటు పడిపోయారు.అసలు మేకప్ లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడ బయట పెట్టడం లేదు.
అయితే అందంగా కనిపించాలనే ఉద్ధేశంలో.ఎంతో శ్రద్ధగా ఎన్నో గంటలు శ్రమించి మేకప్ వేసుకుంటారు.
కానీ, ఆ మేకప్‌ను తొలగించేటప్పుడు మాత్రం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరు.నిజానికి మేకప్ వేసుకునేటప్పుడే కాదు.
దాన్ని తీసేటప్పుడు కూడా అనేక జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి లేటెందుకు ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి.
సాధారణంగా కొందరు తెలిసో తెలియకో రిమూవర్ ఉపయోగించినా.గట్టిగా రుద్దుతూ మరీ మేకప్‌ను శుభ్రం చేసుకుంటారు.కానీ, గట్టి గట్టిగా రుద్దడం వల్ల చర్మ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే కాస్త లేటైనా సున్నితంగా మేకప్‌ను రిమూవ్ చేసుకోవాలి.
కొందరు రిమూవర్‌తో మేకప్‌ను తొలగించాక అలానే ఉండి పోతారు.కానీ, రిమూవర్స్ మేకప్‌ను పూర్తిగా ఎప్పుడూ తొలిగించలేవు.అందుకే రిమూవర్స్ వాడిన తర్వాత కూడా ఖచ్చితంగా వాటర్‌తో ఫేస్‌ను శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ పూసుకోవాలి.మరియు పెదాలకి లిప్ బామ్‌ను సైతం అప్లై చేసుకోవాలి.
మేకప్ తొలగించేటప్పుడు కళ్లతో ఎప్పుడూ స్టార్ట్ చేయరాదు.పెదాలతో మొదలుపెట్టి బుగ్గలు, గడ్డం, నుదురు భాగాలను శుభ్రం చేసుకోవాలి.చివర్లో కంటి మేకప్‌ను రిమూవ్ చేసుకోవాలి.
రిమూవర్స్‌తో మేకప్‌ను ఎంత తొలగించినా.
వాటి అవశేషాలు చర్మ రంధ్రాల్లోకి చేరితాయి.అలాగని వాటిని అలానే వదిలేస్తే రకరకాల చర్మ సమస్యలు చుట్టేస్తాయి.
కాబట్టి, మేకప్‌ను తొలిగించ అనంతరం ముఖానికి ఆవిరి పట్టుకోవాలి.ఆపై వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మేకప్ అవశేషాలు తొలిగిపోతాయి.
ఇక మేకప్‌ను ఏదో పై పైన కాకుండా.కళ్ల చివర్లు, మెడ, చెవులు వంటి భాగాలన్నిటినీ పూర్తిగా క్లీన్ చేసుకోవాలి.లేదంటే ఆయా భాగాల వద్ద చర్మం ఘోరంగా డ్యామేజ్ అవుతుంది.