కరోనా ఈ పేరు వింటే చాలు ప్రపంచదేశాలన్నీ బెంబేలెత్తిపొతున్నాయి.రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరుగుతూ ఉండటంతో అన్ని దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దాదాపు 31 వేల మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంభయంగా గడుపుతున్నారు.కరోనా వైరస్ కారణంగా చైనా ఆర్థికంగా కూడా కుదేలవుతోంది.
తాజాగా ఒక నర్సు కుమార్తె కరోనా వైరస్ బాధితులకు సేవలందిస్తున్న తల్లితో గాలిలో ” అమ్మా… నిన్ను నేను మిస్స్ అవుతున్నా ” అంటూ సంజ్ఞలు చేయటానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తన తల్లిపై బాలిక ప్రేమను వ్యక్తం చేస్తున్న తీరుకు నెటిజన్లు కూడా కంటతడి పెడుతున్నారు.
చైనాలో లీ హయాన్ ఒక ప్రముఖ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు చేస్తోంది.
ఒక సంచిని తీసుకొని వచ్చిన కూతురు ఇద్దరూ వైరస్ సోకకుండా మాస్క్ లను ధరించి ఉండటంతో దూరం నుండే గాల్లోనే హగ్ ఇస్తూ సంజ్ఞలు చేసింది.కలుసుకోవడానికి చైనాలో నర్సులకు కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉండటం వలన ఎయిర్ హగ్ ద్వారా కూతురు తన తల్లిపై ప్రేమను చాటుకుంది.తన కూతురుకు తల్లి తాను కరోనా వైరస్ తో పోరాడి తిరిగి ఇంటికి వస్తానని చెప్పింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.