ఇప్పటికే ఏపీ రాజధానిని మూడు జిల్లాలుగా చేయబోతున్నట్టు ప్రకటించిన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణం అయ్యాడు.దీనిపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
మొత్తం ఈ ఎపిసోడ్ లో అమరావతి ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో జగన్ నిర్ణయానికి జనాలు జై జైలు పలుకుతున్నారు.విపక్షాలు దీనిపై ఎన్ని వెటకారపు విమర్శలు చేసినా జగన్ మాత్రం పరిపాలనకు అనుకూలంగా, మిగతా ప్రాంతాల్లో పట్టు సాధించేలా తన వ్యూహాన్ని సమర్ధవంతంగా అమలు చేసాడు.
తాజాగా అటువంటి వ్యూహానికి పదునుపెట్టేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.ఈ మేరకు ఏపీలో 25 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టుగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు.
విశాఖలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చామన్నారు.విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో మూడు రాజధానులు వస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు జగన్ నిర్ణయాన్నిస్వాగతించారు.