రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులపై జిఎన్ రావు కమిటీ నివేదికను ఈ రోజు ఏపీ సీఎం జగన్ కు కమిటీ సభ్యులు అందించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
రాజధాని అభివృద్ధి అనే అంశాలపై కమిటీ సభ్యులు అందరం కలిసి పూర్తిగా అధ్యయనం చేశామని, ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక తయారు చేసినట్టు వారు వివరించారు.రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అసమానతలు ఉన్నాయని, కొన్ని కొన్ని ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయని ,మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధిలో దూసుకు వెళ్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు.
వీటి మధ్య సమతూకం సాధించాలని, అందుకోసమే రెండు అంచెల వ్యూహాన్ని తాము సూచించినట్టు వారు చెప్పారు.ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది.
అలాగే నదులు, అడవులు ఉన్నాయి.అభివృద్ధి వల్ల పర్యావరణానికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా తాము సూచనలు చేసినట్లు చెప్పారు.
అభివృద్ధి ఒక్క చోటకే పరిమితం అవ్వకూడదని, వికేంద్రీకరణ జరగాలన్నారు.అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడుచేసుకోవడం కాదని, అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకునే తాము సూచనలు చేసినట్టుగా చెప్పారు.
రాష్ట్రంలో తాము సుమారు 10 ,600 కిలోమీటర్లు తిరిగి రాజధాని అభివృద్ధి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేసినట్టు చెప్పారు.తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉందని, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని విభజించాలని తాము సూచించినట్టుగా తెలిపారు.
కమిటీ సూచనలు ఇవే :
- విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్.
- విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి.
- తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు, అలాగే వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి.
- శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్, అమరావతి మరో బెంచ్, విశాఖలో మరో బెంచ్ ఏర్పాటు చేయాలి.
- అమరావతిలో రాజ్ భవన్ నిర్మించాలి