తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మూడో ప్రత్యామ్నాయంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా ఎన్నికల ప్రచారంలో జోరు చూపించాడు.అయితే ఈ ఎన్నికలలో జనసేన ప్రభావం ఎ స్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
అయితే రానున్న ఎన్నికల ఫలితాలలో జనసేన సత్తా ఏ స్థాయిలో ఉందో అనేది అందరికి ఒక అవగాహన వస్తుంది.అయితే ఏపీలో రెండు పార్టీలకి చాలా బలమైన నష్టం మాత్రం జనసేన కలిగించింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది కూడా పాల్గొన్నాడు.తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో జనసేన పార్టీ ప్రభావం గురించి ఆది ఆసక్తికర వాఖ్యలు చేసాడు.
ఏపీలో జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఎ ఒక్కరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని, రిజల్ట్ తర్వాత అందరూ పవన్ కళ్యాణ్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు అని చెప్పుకొచ్చాడు.కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలో జనసేన పార్టీ చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది అని తన అభిప్రాయం చెప్పాడు.
మరి హైపర్ ఆది అంచనా ఎంత వరకు నిజం అవుతుందో అనేది ఫలితం వచ్చేంత వరకు వేచి చూడాలి.