అమెరికాలో నివహిస్తున్న వరుస అందాల పోటీలలో భారత సంతతి అమ్మాయిలు సత్తా చాటుతున్నారు.మొన్నటికి మొన్న అమెరికాలో జరిగిన మిస్ అమెరికా అందాల పోటీలలో కిమ్ కుమారి విజయం సాధించగా తాజాగా న్యూజెర్సీ లో జరిగిన అందాల పోటీలలో మరో భారతీయురాలు అందాల కిరీటం గెలుపొందింది.
న్యూజెర్సీలోని రాయల్ఆల్బర్ట్ ప్యాలెస్ లో నిర్వహించిన మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ-2019 పోటీల్లో భారతీయ-అమెరికన్ ఇషాచంద్ర కోడె మొదటి విజేతగా నిలిచారు, పురస్కారాన్ని అందుకున్నారు.న్యూజెర్సీలో మెడిసిన్ కోర్సు అభ్యసిస్తున్న ఆమె తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సెకండ్ డిగ్రీ కూడా సాధించారు.
చదువులో సైతం ముందు ఉండే ఇషా తానూ విజేతగా నిలుస్తానని అసలు ఊహించలేదని తెలిపారు.ఇదిలాఉంటే ఇషా తల్లి తండ్రులు విజయవాడకి చెందినా వారు అయితే ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడటంతో ఇషా పుట్టి పెరగడం కూడా అమెరికాలోనే జరిగింది.ఇషా విజయాన్ని సాధించినందుకు తెలుగు సంఘాలు అభినందనలు తెలిపాయి.