సిఆర్పిఎఫ్ పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ని వంటరి చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.ప్రపంచ దేశాల మద్దతుతో పాకిస్తాన్ పై ఓ వైపు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు పాకిస్తాన్ నిలువరించడానికి భారత ప్రభుత్వం తనకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది.
ఇందులో భాగంగా పాకిస్తాన్ వస్తువుల దిగుమతి పై సుంకం పెంచిన భారత తాజాగా పాకిస్తాన్ కి వెళ్లే సింధు జలాల్ని నిలిపేసింది.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ వేదికలపై భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై తీసుకు వస్తున్న ఒత్తిడి కి ఆ దేశం ప్రభుత్వం దారిలోకి వస్తుంది.
తాజాగా ఈ రోజు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ తో భేటీ అయిన తర్వాత ముంబై ట్రాక్స్ సూత్రధారి, టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తోయిబా సంస్థ అధినేత హఫీజ్ సయ్యద్ సంస్థ జమాత్ ఉద్ దవా సంస్థపై పాకిస్తాన్ లో నిషేధం విధించింది.ఆ సంస్థ తరఫున ఇలాంటి యాక్టివిటీస్ ని దేశంలో చేసిన కఠిన చర్యలు తీసుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం రెడీ అయింది.
దీంతో భారత ప్రభుత్వ ఒత్తిళ్లకు పాకిస్తాన్ మెల్లగా దారిలోకి వస్తుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.