మహిళల అందాన్ని రెట్టింపు చేసే జుట్టు విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి.కాస్త ఓపికగా శ్రద్ద పెడితే అందమైన ఒత్తైన జుట్టును పొందవచ్చు.
ఈ రోజుల్లో తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలు మానేసి షాంపూలను వాడుతున్నారు.షాంపూలలో ఉండే హానికరమైన రసాయనాల ప్రభావం జుట్టు మీద ఉండకుండా షాంపూలో ఇప్పుడు చెప్పబోయే పదార్ధాలను కలపాలి.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
షాంపూలో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ని కలిపి తల రుద్దుకోవాలి.
ఈ విధంగా రోజ్ వాటర్ ని కలపటం వలన జుట్టుకు అవసరమైన తేమ అందుతుంది.
షాంపూలో గ్లిజరిన్ కలిపి తలా రుద్దుకోవాలి.
అయితే గ్లిజరిన్ మాత్రం 5 చుక్కలు మాత్రమే వేయాలి.గ్లిజరిన్ వేయటం వలన జుట్టుకు అవసరమైన తేమ అంది జుట్టు బలంగా అందంగా ఉంటుంది.
షాంపూలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి తలను రుద్దుకోవాలి.నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో చుండ్రు,దురదను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
షాంపూలో రెండు చుక్కల బాదం నూనెను కలిపి తలను రుద్దుకోవాలి.బ్దం నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జుట్టు సమస్యల పరిష్కారంలో సహాయపడతాయి.
ఉసిరిని చాలా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.షాంపూలో ఒక స్పూన్ ఉసిరి నీటిని కలపాలి.
ఉసిరి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.